చిరు చిన్నల్లుడ్ని టార్గెట్ చేసింది ఎవరు ?


 

 Kalyan dhev lodges police complaint
Kalyan dhev lodges police complaint

చిరంజీవి చిన్నల్లుడు హీరో కళ్యాణ్ దేవ్ ని కొంతమంది టార్గెట్ చేసారు . దాంతో కళ్యాణ్ దేవ్ పై అదేపనిగా విమర్శలు చేస్తుండటంతో ఆ విమర్శల దాడి మరీ అసభ్యకరంగా ఉండటంతో వాటిని తట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు కళ్యాణ్ దేవ్ . చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ని కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . ఈ ఇద్దరికీ ఒక పాప కూడా అయితే ఇటీవల శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు .

భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకున్నాక ఈ విమర్శలు ఎక్కువయ్యాయి కళ్యాణ్ దేవ్ పైన దాంతో తనని అదేపనిగా టార్గెట్ చేస్తుండటంతో ఆ వివరాలతో పోలీసులను కలిసాడు కళ్యాణ్ దేవ్ . ఇక పోలీసులు కళ్యాణ్ దేవ్ ని టార్గెట్ చేసిన వాళ్ళని పట్టుకోవడంలో దృష్టి సారించారు . విజేత అనే చిత్రంలో హీరోగా నటించిన కళ్యాణ్ దేవ్ కు ఆ సినిమా గట్టి షాక్ ఇచ్చింది దాంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు . మళ్ళీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాడు .