ఎక్స్‌క్లూసివ్‌: క‌ల్యాణ్‌రామ్ సినిమా మొద‌లైంది!


ఎక్స్‌క్లూసివ్‌: క‌ల్యాణ్‌రామ్ సినిమా మొద‌లైంది!
ఎక్స్‌క్లూసివ్‌: క‌ల్యాణ్‌రామ్ సినిమా మొద‌లైంది!

నందమూరి క‌ళ్యాణ్‌రామ్ కెరియర్ ప్రారంభం నుంచి కొత్త వాళ్ల‌ని ప్రోత్స‌హిస్తూ సినిమాలు చేస్తున్నారు. అలా చేసిన సినిమాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని సూప‌ర్‌హిట్‌లుగా నిలిస్తే కొన్ని డిజాస్ట‌ర్‌లు అయ్యాయి. అయినా స‌రే కొత్త వాళ్ల‌ని మాత్రం ప్రోత్స‌హించ‌డం మాన‌డం లేదు. కొత్త కాన్సెప్ట్‌ల‌తో ఎవ‌రు వ‌చ్చినా తాను హీరోగా న‌టిస్తూ సొంతంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ న‌టిస్తూ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల వేగేశ్న స‌తీష్ రూపొందించిన `ఎంత మంచివాడ‌వురా` చిత్రంలో న‌టించిన క‌ల్యాణ్‌రామ్ ఆ సినిమా ఆశించిన విజ‌యాన్ని అందించ‌క‌పోవ‌డంతో ఈ సారి యువ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చారు. `ఢీ` సినిమా ఫేం  మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ రెడ్డి త‌న‌యుడు మ‌ల్లిడి వేణు ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. 13వ శ‌తాబ్దం నేప‌థ్యంలో పిరియాడిక్ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్ర‌త్యేక రాజ‌మ‌హ‌ల్ సెట్‌లో కీల‌క ఘ‌ట్టాల్ని చిత్రీక‌రిస్తున్నారు. రాజుల కాలం క‌థ కావ‌డం వ‌ల్లే క‌ల్యాణ్‌రామ్ ఆ గెట‌ప్‌కు త‌గ్గ‌ట్టుగా వేష‌ధార‌ణ, హెయిర్ వుండాల‌ని లాంగ్ హెయిర్‌ని పెంచి ఇటీవ‌ల అపోలో జిమ్ వ‌ద్ద క‌నిపించ‌డం ప‌లువురిని ఆశ్య‌ర్యానికి గురిచేసిన విష‌యం తెలిసిందే.