అంత మంచివాడు అంటున్న కళ్యాణ్ రామ్


Kalyan Ram Entha Manchi Vaadavura
Kalyan Ram Entha Manchi Vaadavura

తెలుగు సినిమాల విషయంలో టైటిల్స్ దగ్గర నుండి ఒకటి గమనిస్తే, టైటిల్ కి సినిమాకి వ్యతిరేకంగా ఉంటాయి. కాని అదే బాగుంటుంది అని జనాలు కూడా అంటారు. అదే అక్కడ మనం గమనించాల్సిన విషయం. మంచివాడు అని టైటిల్ పెడితే అందరూ మంచివారు అనుకోరు, కొంతమందికి మంచివాడుగా ఉంటూ ఆ కారక్టర్ ని మలుపు తిప్పితే అప్పుడు జనాలు చూస్తారు.

ఇప్పుడు “కళ్యాణ్ రామ్” నటిస్తున్న కొత్త సినిమా “ఎంతమంచివాడవురా” నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ చూస్తే, తెలిసిపోయేది ఏంటంటే, రౌడిలని కుల్లబోడిచే హీరో లాగ వెళ్తున్న పోస్టర్. కాని సినిమాలో మంచివాడు అని ఉంది.

అంటే మంచి చెయ్యడానికి, చెడుకి ఎదురు వెళ్లిన తప్పు లేదు అని మన తెలుగు సినిమాలు చూస్తే సరిపోతుంది. ఇంకొక దర్శకుడు అయితే అలాఅనుకోవచ్చు కానీ, ఇక్కడే మనం ఆచితూచి ఆలోచించాల్సిన విషయం. అసలు విషయం ఏంటంటే ఈ సినిమాకి దర్శకుడు “సతీష్ వేగేశ్న” అని మనకి తెలుసు కదా, ఒక “శతమానం భవతి“, ఒక “శ్రీనివాస కళ్యాణం” రెండు సినిమాలు ఫ్యామిలీ ని కట్టిపడేసే సినిమాలు.

మరి ఈ మంచివాడులోని పోస్టర్ కి, సినిమాకి సంబంధం లేదు, సినిమాలో చాలా మ్యాటర్ ఉంది అని ఎవ్వరైనా ఊహించొచ్చు. నేను చెప్పిన విషయం కూడా నిజం అవ్వొచ్చు అని మీకు అనిపిస్తుంది కదా, ఇంకా మనం చెయ్యాల్సింది “సంక్రాంతి” పండగ దాకా ఆగాల్సిందే, మరి అప్పుడే కదా సినిమా వచ్చేది.

పైగా సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. వాటికి తట్టుకొని మరి ఈ సినిమా నిలబడుతుందా, లేక దర్శకుడు, హీరో ఇద్దరు మంచివాళ్ళుగా మొత్తం సినిమాని నిలబెడతారా వేచి చూద్దాం.