క‌ల్యాణ్‌రామ్ ట్రిపుల్‌ రోల్ ప్లే చేస్తున్నారా?


క‌ల్యాణ్‌రామ్ ట్రిపుల్‌ రోల్ ప్లే చేస్తున్నారా?
క‌ల్యాణ్‌రామ్ ట్రిపుల్‌ రోల్ ప్లే చేస్తున్నారా?

నందమూరి క‌ల్యాణ్‌రామ్ న‌టించిన చిత్రం `ఎంత మంచి వాడ‌వురా`. వేగేశ్న స‌తీష్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో కొంత విరామం తీసుకున్న క‌ల్యాణ్‌రామ్ తాజాగా ఓ భారీ చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. `118` వంటి విభిన‌ప్న‌మైన సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌తో హిట్‌న త‌న ఖాతాలో వేసుకున్న క‌ల్యాణ్‌రామ్ తాజాగా మరో విభిన్న‌మైన సినిమాని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది.

ఈ చిత్రం ద్వారా న్యూ క‌మ‌ర్ ర‌వీంద‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నార‌ట‌. కొత్త ద‌నం వుంటే త‌ప్ప సినిమాలు అంగీక‌రించ‌న క‌ల్యాణ్ రామ్ నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వీంద‌ర్ చెప్పిన స్క్రిప్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతోంది. ఇందులో హీరో క‌ల్యాణ్‌రామ్ ట్రిపుల్ రోల్‌లో క‌నిపించ నున్నార‌ట‌.

గ‌తంలో ఎన్టీఆర్‌, చిరంజీవి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ ట్రిపుల్ రోల్‌లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. తాజాగా వీరి త‌ర‌హాలో తొలిసారి క‌ల్యాణ్‌రామ్ త్రిపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ట‌. స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొంద‌నున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇప్ప‌టికే పూర్తియింద‌ని, వ‌చ్చే నెల నుంచి ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తున్నార‌ని తెలిసింది.