ఎన్టీఆర్ నమ్మకం నిజమైందన్న కళ్యాణ్ రామ్

Kalyanram happy about 118 results118 చిత్రాన్ని చూసిన ఎన్టీఆర్ తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేసాడని అది ఇప్పుడు నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందని అంటున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ . నిన్న కళ్యాణ్ రామ్ నటించిన ” 118 ” చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే . కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 చిత్రంలో నివేదా థామస్ , షాలిని పాండే హీరోయిన్ లుగా నటించారు .

 

కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించగా మంచి రివ్యూస్ తో పాటు పాజిటివ్  టాక్ కూడా తెచ్చుకుంది . అయితే ఈ 118 చిత్రం బిసి కేంద్రాల్లో ఆడటం కష్టమే కానీ మల్టీప్లెక్స్ లలో మాత్రం ఆదరణ లభించడం ఖాయంగా కనిపిస్తోంది . ఇక ఈ సినిమాని రిలీజ్ కి ముందే కొంత భాగం తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ చూశాడట ! అప్పుడే ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పాడట అందుకే  తారక్ నమ్మకం నిజమైందని అంటున్నాడు కళ్యాణ్ రామ్ . 118 చిత్రం వసూళ్ల సంగతి పక్కన పెడితే  కళ్యాణ్ రామ్ కెరీర్ లో మాత్రం ఓ విభిన్నతరహా చిత్రంగా నిలవడం ఖాయం .

English Title : Kalyanram happy about 118 results