విల‌న్‌ని కాపాడిన క‌మ‌ల్‌హాస‌న్‌!


విల‌న్‌ని కాపాడిన క‌మ‌ల్‌హాస‌న్‌!
విల‌న్‌ని కాపాడిన క‌మ‌ల్‌హాస‌న్‌!

90వ ద‌శ‌కంలో తెలుగు, త‌మిళ చిత్రాల్లో విల‌న్‌గా ఆక‌ట్టుకున్న న‌టుడు పొన్నాంబ‌ళ‌మ్‌. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, చిరంజీవి వంటి సీనియ‌ర్ హీరోల చిత్రాల‌తో పాటు శ్రీ‌కాంత్‌, జ‌గ‌ప‌తిబాబు న‌టించిన చిత్రాల్లోనూ కీల‌క పాత్ర‌ల్లో విల‌న్‌గా న‌టించిన పొన్నాంబ‌ళ‌మ్ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటున్నారు.

కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇటీవ‌ల చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతున్నారు. అయితే ఆయ‌న ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్ర‌మే అని తెలిసింది. దీంతో విష‌యం తెలుసుకున్న స్టార్ హీరో క‌మ‌ల్‌హాస‌న్ అత‌నికి ఆర్థికంగా అండగా నిలిచారని తెలిసింది. అనారోగ్యంతో పాటు ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న పొన్నాంబ‌ళ‌మ్‌తో క‌మ‌ల్‌హాస‌న్ ఫోన్‌లో మాట్లాడి అభ‌య‌మిచ్చార‌ట‌.

పొన్నాంబ‌ళ‌మ్ వైద్య ఖ‌ర్చుల‌తో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల బాధ్య‌త‌ల‌ని కూడా తానే తీసుకుంటాన‌ని, ప్ర‌త్యేక టీమ్‌ని ఏర్పాటు చేసిన క‌మ‌ల్ ఎప్ప‌టిక‌ప్పుడు పొన్నాంబ‌ళ‌మ్ ఆరోగ్య‌ప‌రిస్థితిని తెలుసుకుంటూ ఆర్థిక స‌హాయం చేస్తున్నార‌ట‌. పొన్నాంబ‌ళ‌మ్ ఆక్సిజ‌న్ పెట్టుకుని వున్న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.