విశ్వరూపం 2 కు అడ్డంకులు లేవు


Kamal haasan vishwaroopam 2 clears legal hurdlesకమల్ హాసన్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం చిత్రం ” విశ్వరూపం 2” . రేపు అన్ని అడ్డంకులను అధిగమించి తెలుగు , తమిళ , హిందీ బాషలలో భారీ ఎత్తున విడుదల కానుంది . విశ్వరూపం 2 చిత్రాన్ని విడుదల కాకుండా పిరమిడ్ సైమిరా కోర్టులో కేసు వేయడంతో ఈ సినిమా విడుదల అవ్వడం డౌటే అని అనుకున్నారు దానికి తోడు కరుణానిధి చనిపోవడంతో విశ్వరూపం 2 వాయిదా పడటం ఖాయమని అనుకున్నారు కట్ చేస్తే పిరమిడ్ సైమిరా వాళ్లకు కమల్ 7. 75 కోట్లు చెల్లించడంతో పిటీషన్ ని మద్రాస్ హైకోర్టు కోర్టు కొట్టివేసింది .

కమల్ హాసన్ నటించి నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించాడు కూడా . పూజా కుమార్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పై కమల్ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు . విశ్వరూపం మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి . అతి కష్టం మీద పిరమిడ్ వాళ్లకు కమల్ డబ్బులు సమకూర్చడంతో అడ్డంకులన్నీ తొలిగిపోయాయి దాంతో ఊపిరి పీల్చుకున్నాడు కమల్ . అసలు పిరమిడ్ సైమిరా వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటివి కావు కానీ వాళ్లతో సినిమా చేస్తానన్న కమల్ కాలయాపన చేస్తూ కాలం వెళ్లదీస్తుండటంతో కోర్టు ని ఆశ్రయించారు . దాంతో రేపు అన్ని అడ్డంకులను అధిగమించి విడుదల అవుతోంది .

English Title: Kamal haasan vishwaroopam 2 clears legal hurdles