కూతురి వయసున్న హీరోయిన్ తో కమల్ హాసన్ సహజీవనం

కూతురి వయసున్న హీరోయిన్ తో కమల్ హాసన్ సహజీవనం
కూతురి వయసున్న హీరోయిన్ తో కమల్ హాసన్ సహజీవనం

ముందుగా ఒక చిన్న సామెత గుర్తు చేసుకుని తర్వాత మ్యాటర్ లోకి వెళ్దాము.

“నీతులు అన్నీ కోడలికి చెప్పి, అత్త తెడ్డు నాకిందట.” ఈ విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశానికి లింకు చేసుకుంటే, లోకనాయకుడు అని అభిమానులు, సినిమా ప్రేక్షకులు పిలుచుకునే కమలహాసన్ కేవలం సినిమాల్లోనే హీరో. ఆయన వ్యక్తిగత నిజ జీవితంలో ఎప్పుడూ వివాదాలు అనేక రకమైన ఇబ్బందికరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. సారిక అనే ఒక నటి తో మొదటి సారి, వాణి గణపతి అనే డాన్సర్ తో రెండోసారి, చివరికి నటి గౌతమితో మూడోసారి ఇలా 3 సార్లు వైవాహిక జీవితంలో కమలహాసన్ విఫలమయ్యాడు. ఈ మధ్య మంచు లక్ష్మికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటి శృతి హాసన్ తాను విపరీతంగా విస్కీ కి బానిస అయ్యానని, అందుకే గత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ వచ్చిందని, ఇప్పుడు మళ్లీ తాను బానే ఉన్నానని చెప్పింది. తన కూతుర్ని చక్కదిద్దుకోవడం చేతకాని కమలహాసన్, దేశం ఎలా ఉండాలోమాత్రం దేశంలో పరిస్థితులు ఎలా ఉండాలో.? వేదికలెక్కి నప్పుడల్లా చెబుతూనే ఉంటాడు.

తాజాగా కమల్ హాసన్ మరో సంచలనాత్మకమైన వార్తతో మీడియాలో నిలిచాడు ఇటీవల జరిగిన కమలహాసన్ పుట్టినరోజు వేడుకలకు నటి పూజా కుమార్ హాజరయ్యారు. కమల్ హాసన్ కుటుంబ సభ్యులందరితో కలిసి పూజ కుమార్ ఫోటో వైరల్ అయింది. ఇప్పటికే పూజా కుమార్ కమల్ హాసన్ సహజీవనం చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తూ ఉండగా, ఈ ఫోటో మరియు కమల్ హాసన్ పూజ కుమార్ ల ప్రవర్తన దానికి మరింత ఊతం ఇచ్చింది. పూజా కుమార్ అమెరికాలో సెటిల్ అయిన నటి. ఇండియా వచ్చి వరుసబెట్టి కమల్ తో విశ్వరూపం, ఉత్తమ విలన్, విశ్వరూపం 2 సినిమాలు నటించింది. ఇవి తప్ప ఆమె ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు, ఒప్పుకోవడం లేదు. దీనికి కూడా కమల్ హాసన్ కారణమని, ఆమె కెరియర్ లో ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలో, కమల్ హాసన్ నిర్ణయం తీసుకుంటున్నారని కూడా అందరూ చెప్తున్నారు. మరి నటి పూజా కుమార్ నుంచి ఈ విషయంపై ఎటువంటి అధికారికంగా వివరణ రాలేదు ఏది ఏమైనా పెళ్లి వయసున్న కూతుర్లను దగ్గర పెట్టుకొని కమలహాసన్ మరి ఇలాంటి వేషాలు ఎందుకు వేస్తున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు.