సినిమాలలో నటించాలని ఆసక్తి ఉందా ?


సినిమాలలో నటించాలని ఆసక్తి ఉందా ?
Kamal Hassan and Shankar

మీకు సినిమాలలో నటించాలనే ఆసక్తి ఉంటే తక్షణం మీ ప్రొఫైల్ ని casting. indian 2@ gmail .com కు పంపించండి అదృష్టం పరీక్షించుకోండి . జాతీయ ఉత్తమ నటుడు కమల్ హాసన్ సినిమాలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేయండి . మీకు ఉండాల్సిందల్లా ఆసక్తి , ఆపై అదృష్టం మాత్రమే ! ఇండియన్ సంచలన విజయం సాధించడంతో ఇన్నాళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నారు శంకర్ .

కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా మొదట ఎంపిక చేసారు . అయితే సినిమా ఆలస్యం కావడంతో కాజల్ తప్పుకుంది దాంతో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకున్నారు . త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో పెద్ద ఎత్తున కొత్తవాళ్ళని పరిచయం చేయడానికి నడుం బిగించారు . కాబట్టి నటన పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు మీ ప్రొఫైల్ ని మెయిల్ చేయండి లక్కీ ఛాన్స్ కొట్టేయండి .