క్రిష్ ని తప్పుపడుతున్న నిర్మాత

Kamal jain suuports kangana ranaut on manikarnika controversyమణికర్ణిక విషయంలో తప్పు క్రిష్ దే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు ఆ చిత్ర నిర్మాత కమల్ జైన్ . నా మద్దతు పూర్తిగా కంగనా రనౌత్ కే అంటూ క్రిష్ ని తప్పుపట్టాడు దాంతో క్రిష్ ని ఘోరంగా అవమానించినట్లే అని అంటున్నారు . మణికర్ణిక చిత్రానికి తొలుత దర్శకులు క్రిష్ అయితే కంగనా రనౌత్ తో వచ్చిన విబేధాల వల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నాడు . అయితే జనవరి 25 న సినిమా రిలీజ్ కావడంతో ఈ వివాదం మొదలయ్యింది.

 

అటు కంగనా ఇటు క్రిష్ ఎవ్వరూ తగ్గడం లేదు దాంతో మణికర్ణిక చిత్రానికి విపరీతమైన పబ్లిసిటీ వివాదాల రూపంలో వచ్చింది . ఇక ఈ వివాదంపై స్పందించిన నిర్మాత తప్పు క్రిష్ పై నెట్టేశాడు అంటే క్రిష్ కు అవమానమే ! క్రిష్ చెప్పేది నిజమే అయితే కోర్టు కెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సిందిగా సవాల్ కూడా విసిరాడు కమల్ జైన్ . దీంతో క్రిష్ సైలెంట్ అవడమే బెటర్ అని అంటున్నారు . క్రిష్ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన విషయం తెలిసిందే . అయితే ఈ  గొడవ వల్ల క్రిష్ ఇమేజ్ మరింతగా డ్యామేజ్ అవుతోంది మరి.

English Title: Kamal jain suuports kangana ranaut on manikarnika controversy