క‌మ‌ల్‌హాస‌న్‌, లైకా మ‌ధ్య ఏం జ‌రుగుతోంది?Kamal Jassan sensational comments on lyca
Kamal Jassan sensational comments on lyca

`ఇండియ‌న్‌2` సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన క్రేన్ విరిగిప‌డ్డి సెట్లో వున్న సిడ్డంది ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ హృద‌య విదార‌క సంఘ‌ట‌న‌ కోలీవుడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ సంఘ‌ట‌న‌పై తెలుగు స్టార్‌లు, త‌మిళ స్టార్‌లు స్పందించారు. ఈ దుర్ఘ‌ట‌న‌పై వెంట‌నే స్పందించిన హీరో క‌మ‌ల్‌హాస‌న్ బాధితుల‌కు కోటి రూపాయ‌ల స‌హాయాన్ని ప్ర‌క‌టించారు.

బాధితుల‌కు అండ‌గా వుండాల‌ని లైకాకు ఘాటుగా లేఖ రాశారు. దీనిపై అదే త‌ర‌హాలో లైకా వ‌ర్గాలు స్పందించి క‌మ‌ల్‌ని షూట్‌లో పాల్గొంటో బాగుంటుంద‌ని చూచించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హీరో క‌మ‌ల్‌హాస‌న్‌, ద‌ర్శ‌కుడు శంక‌ర్ ని ఇంట‌రాగేష‌న్ చేసిన విష‌యం తెలిసిందే. క‌మ‌ల్ మాత్రం లైకాకు వ్య‌తిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన‌ట్టు త‌మిళ మీడియా కోడై కూస్తోంది.

మంగ‌ళ‌వారం చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన క‌మ‌ల్‌హాస‌న్ లైకా త‌ప్పిదం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని, ఈ బాధ్య‌త లైకాదేన‌ని స్ప‌ష్టం చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యంపై క‌మ‌ల్ లేదా చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్ల‌డించే వ‌ర‌కు వేచిచూడాలి.