ఇక్క‌డ నాగ్.. అక్క‌డ క‌మ‌ల్‌!


Kamal prasenting 83 tamil version
Kamal prasenting 83 tamil version

భార‌తీయ క్రికెట్ చ‌రిత్ర‌లో 1983కి ప్ర‌త్యేక స్థానం వుంది. దేశాన్ని విశ్వ విజేత‌గా ప్రంచ య‌మ‌నిక‌పై స‌గ‌ర్వంగా నిల‌బెట్టిన ఇయ‌ర్ అది. 1983లో జ‌రిగిన వ‌రల్డ్ క‌ప్‌లో భార‌త్ క‌ప్ గెలుస్తుంద‌ని, విశ్వ విజేత‌గా అవ‌త‌రిస్తుంద‌ని, ఫైన‌ల్‌లో అప్ప‌టికే విన్న‌ర్‌గా వున్న వెస్టిండీస్ జ‌ట్టుని మ‌ట్టిక‌రిపించి క‌ప్‌ని సాధిస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

అలాంటి అసాధ్యం అనుకున్న భార‌త్ క‌ల‌ని క‌పిల్ త‌న చాక‌చ‌క్యంతో టీమ్‌ని డేర్ డెవిల్స్‌గా నిలిపి తొలిసారి వ‌ర‌ల్డ్ క‌ప్‌ని అందించారు. అనాటి అపూర్వ‌ఘ‌ట్టాల‌ని వెండితెరై దృశ్య‌మానం చేస్తూ రూపొందిన చిత్రం `83`. ర‌ణ్‌వీర్‌సింగ్ క‌పిల్‌దేవ్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క‌బీర్‌సింగ్ రూపొందిస్తున్నారు. క‌పిల్ వైఫ్ పాత్ర‌లో దీపికా ప‌దుకోన్ న‌టిస్తూ వ‌న్ ఆఫ్ ద ప్రొడ్యూస‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తోంది.

విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి, మ‌ధు మంతెన‌, క‌బీర్‌ఖాన్‌, సాజిద్ న‌దియా వాలా నిర్మాత‌లుగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుద‌ల కాబోతోంది. ఏప్రిల్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్నఈ చిత్రాన్ని తెలుగులో రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున అందించ‌బోతున్నారు. ఇదే చిత్రాన్ని త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ స‌మ‌ర్పిస్తుండ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ చిత్రాన్ని త‌మిళంలో ప్ర‌మోట్ చేసే బాధ్య‌త త‌న‌కు ద‌క్క‌డం గ‌ర్వంగా వుంద‌ని ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్‌హాస‌న్ మీడియాకు వెల్ల‌డించారు.