కాంచన 3 ఫస్టాఫ్ ఎలా ఉందంటే


ఈరోజు రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 చిత్రం విడుదల అయ్యింది. ఓకేరోజున తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రంపై నెటిజన్లు బాగానే రేటింగ్ ఇస్తున్నారు. ఇక ఇప్పుడే ఫస్టాఫ్ అయిపోయింది. హర్రర్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ ని దట్టించాడు లారెన్స్.

ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకండాఫ్ పై అంచనాలు పెంచాడు లారెన్స్. కాంచన 3 కథ కొత్తగా ఏమి లేదు కానీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. ఒకవైపు భయపెడుతూ మరోవైపు నవ్విస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు లారెన్స్. మొత్తానికి ఈ కాంచన 3 కూడా హిట్ అయ్యేలాగే కనిపిస్తోంది. సెకండాఫ్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగితే హిట్ అయినట్లే.