ట్విట్ట‌ర్‌పై చిందులేస్తున్న ఫైర్ బ్రాండ్‌!


ట్విట్ట‌ర్‌పై చిందులేస్తున్న ఫైర్ బ్రాండ్‌!
ట్విట్ట‌ర్‌పై చిందులేస్తున్న ఫైర్ బ్రాండ్‌!

కంగన ర‌నౌత్‌. బాలీవుడ్ తెర‌పై  ఎంత క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందో అదే స్థాయిలో వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారింది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌రైన కంగ‌నా మొద‌టి నుంచ‌యి త‌న‌ని విమ‌ర్శించిన వారిపై ఎదురుదాడి చేయ‌డం మొద‌లుపెట్టింది. అదే త‌న‌ని బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా నిల‌బెట్టింది.

ఆ త‌రువాత అదే ఇమేజ్ కంగ‌న‌కు ప‌ర్మినెంట్‌గా వుండిపోయేలా చేసింది ఆమె సోద‌రి రంగోలీ. కంగ‌న‌ని ఎవ‌రు ఎలా విమ‌ర్శించినా వారిపై విరుచుప‌డ‌టం రంగోలీకి ఓ అల‌వాటుగా మారింది. హృతిక్ నుంచి తాప్సీ వ‌ర‌కు బాలీవుడ్‌లో కంగ‌న సిస్ట‌ర్స్ విమ‌ర్శించ‌ని వారు లేరంటే అది అతిశ‌య‌యోక్తి కాదేమో. నిత్యం వివాదాల్లో చిక్కుకునే కంగ‌న సిస్ట‌ర్ తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకుంది. విద్వేష‌పూరితంగా పోస్ట్‌లు పెడుతందంటూ తాజాగా రంగోలీ ట్విట్ట‌ర్‌ని ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం స‌స్పెండ్ చేసింది.

దీంతో చిర్రెత్తుకొచ్చిన కంగ‌న ట్విట్ట‌ర్‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తోంది. దేశంలో ట్విట్ట‌ర్ లేకుండా భూస్థాపితం చేయండ‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతూ ఓ వీడియోని విడుద‌ల చేసింది. దాని స్థానంలో దేశీయంగా సోషియ‌ల్ మీడియాని ఏర్పాటు చేసుకుందామ‌ని స‌ల‌హా కూడా ఇస్తోంది. దీనిపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

address the controversy around #RangoliChandel’s tweet, and why freedom of speech is important in a democracy.

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on