దీపిక విషయంలో మాట మార్చిన కంగనా రనౌత్


దీపిక విషయంలో మాట మార్చిన కంగనా రనౌత్
దీపిక విషయంలో మాట మార్చిన కంగనా రనౌత్

సినిమా స్టార్లు అందులోని హీరోయిన్లు బట్టలు మార్చినంత తేలికగా మాటలు మార్చేస్తారు దానిలో పెద్ద గొప్పతనం ఏముంది.? అని ఆశ్చర్యపోనవసరం లేదు. మనం గతంలో చెప్పుకున్నట్లుగా కళా రూపమైన సినిమాను ఎప్పుడైతే అనేక ఇతర విషయాలు డామినేట్ చేయడం మొదలుపెట్టాయో, అప్పటినుంచి సినిమాలలో మరియు సినిమాలలో నటించే వారిలో నిజాయితీ తగ్గిపోయింది. ప్పుడు బాలీవుడ్ లో తాజాగా దీపికాపదుకునే నటించిన “చపాక్” సినిమా రిలీజ్ అయ్యి,నెమ్మదిగా హిట్ టాక్ దిశగా దూసుకెళుతోంది. కానీ దీపికా పదుకొనే చేసిన ఒక పని వల్ల ప్రస్తుతం ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది.

తన సినిమాను ప్రమోషన్ చేసుకునే ఉద్దేశం లో వెళ్ళిందో.? లేక నిజంగానే అక్కడ సంఘటన చూసి స్పందించి వెళ్ళిందో.? తెలియదు కానీ.. దీపికా పదుకొనే, జే.ఎన్.యు వెళ్లి అక్కడ ఒక విద్యార్థి వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడుతూ, మరొక విద్యార్థి వర్గాన్ని విమర్శించడం పెద్ద దుమారాన్ని తీసుకువచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తాలూకు అనేకమంది పెద్దమనుషులు దీపిక ను విమర్శిస్తున్నారు. కొన్ని సంఘాలు మరియు కొంత మంది స్వయం ప్రకటిత మేధావులు అయితే దీపిక “చపాక్” సినిమాను బహిష్కరించాలని రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో తాజాగా కంగనా రనౌత్ కూడా చేరింది. కంగనా రనౌత్ భారతీయ జనతా పార్టీ తాలూకు సిద్ధాంతాలను నేరుగా సపోర్ట్ చేసి ప్రచారం చేసే విషయం అందరికీ తెలిసిందే. మరి నిన్న మొన్నటి వరకు దీపికను సపోర్ట్ చేసిన కంగనా రనౌత్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంఘటన నిజానిజాలు తెలుసుకోకుండా దీపిక జే.ఎన్.యు ఉదంతంలో కొంతమందిని విమర్శిస్తున్న ట్లు మాట్లాడటం తప్పని అభిప్రాయపడింది. జే.ఎన్.యు లో కొంతమంది విద్యార్థులు సమూహంగా ఏర్పడి భారతీయ జవాన్లు చనిపోయినప్పుడు వేడుకలు చేసుకోవడం; తీవ్రవాదులకు ఉరిశిక్ష వేసినప్పుడు నిరసన తెలపటం; భారత ప్రభుత్వానికి భారత స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా నినాదాలు కార్యక్రమాలు చేస్తూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే. అసలు ఈ సమస్యను పరిష్కరించే వలసిన అధికార ప్రతిపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం ఇంకా సాగదీస్తున్నాయి. వివాదాలతో సినిమాలను పబ్లిసిటీ చేసుకోవడం మంచి విషయమే కానీ, మరీ ఆ వివాదాలు మన సినిమా కంటెంట్ ని డామినేట్ చేసి, మరీ మన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం ఎంతైనా నష్టం కలిగిస్తోంది..! అన్న విషయాన్ని దీపికాపదుకునే ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.