ఇందిరా గాంధీ పాత్ర‌లో కంగ‌న ర‌నౌత్‌!

Kangana ranaut in Indira gandhis biopic
Kangana ranaut in Indira gandhis biopic

బాలీవుడ్‌లో  బ‌యోపిక్‌ల ప‌రంప‌ర న‌డుస్తోంది. ఈ త‌ర‌హా చిత్రాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ కూడా జీవిత క‌థల ఆధారంగా సినిమాల్ని నిర్మించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. తాజాగా మ‌రో బ‌యోపిక్ తెర‌పైకి రాబోతోంది. భార‌త రాజ‌కీయాల‌ని ప్ర‌భావితం చేసిన ఉక్కు మ‌హిళ ఇందిరా గాంధీ. ఆమె జీవిత క‌థ ఆధారంగా త్వ‌ర‌లో ఓ బ‌యోపిక్ తెర‌పైకి రాబోతోంది.

ఎన‌ర్జెన్సీ విధించి మ‌హా మ‌హుల‌నే ఇందిరా గ‌డ‌గ‌డ‌లాడించిన విష‌యం తెలిసిందే. ఆమె జీవిత‌క‌థ‌ని తెర‌పైకి తీసుకురానున్నారు. ఇందులో ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ ఇందిరా గాంధీ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఇందుకు సంబంబ‌ధించిన ఫొటో షూట్ .. మేక‌ప్ టెస్ట్ ని ఇటీవ‌లే కంగ‌న‌పై నిర్వ‌హించారు. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించింది కంగ‌న‌.

అవును ఈ ప్రాజెక్ట్‌పై ప‌ని చేస్తున్నాం. స్క్రిప్ట్ తుది ద‌శ‌లో వుంది. అయితే ఇది బ‌యోపిక్ కాదు. ఇదొక పిరియాడిక్ ఫిల్మ్‌. కేవ‌లం పొలిటిక‌ల్ డ్రామా. ఈ చిత్రం ద్వారా భార‌తీయ రాజ‌కీయ స్వ‌రూపాన్ని నేటి త‌రానికి ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం` అని కంగ‌న వెల్ల‌డించింది.