క్రిష్ కావాలనే చెత్తగా తీసాడని అంటున్న కంగనా


 Kangana Ranaut sensational comments on NTR biopic

ఎన్టీఆర్ బయోపిక్ ని కావాలనే క్రిష్ చెత్తగా తీసాడని సంచలన ఆరోపణలు చేసింది వివాదాస్పద భామ కంగనా రనౌత్ . క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం ” మణికర్ణిక ” . అయితే ఆ సినిమా మేకింగ్ విషయంలో కంగనా కు క్రిష్ పనితనం నచ్చలేదు అందుకే క్రిష్ ని తప్పించి మళ్ళీ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసి రిలీజ్ చేసింది అంతేకాదు టైటిల్ లో కూడా తన పేరుని దర్శకత్వం అని వేసుకుంది క్రిష్ కు తర్వాతి స్థానాన్ని ఇచ్చింది .

 

కట్ చేస్తే ఇద్దరి మధ్య పెద్ద వివాదమే నడిచింది , దాంతో క్రిష్ పై కంగనా కోపంగా ఉంది , ఇంకేముంది ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు రెండు చిత్రాలు కూడా డిజాస్టర్ కావడంతో బాలకృష్ణ పై ప్రేమని ఒలకబోస్తూ క్రిష్ కు సరిగా డైరెక్షన్ రాదని మరోసారి బాంబ్ పేల్చింది . పాపం ఇప్పటికే రెండు సినిమాలు ప్లాప్ అయి బాధతో ఉన్న క్రిష్ కు కంగనా మరింత కారం పూసింది మరింత మంట పెట్టడానికి .

 

English Title: Kangana Ranaut sensational comments on NTR biopic