క్రిష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కంగనా

Kangana ranaut strong warning to krishమణికర్ణిక చిత్రానికి నేనే దర్శకత్వం వహించాను ఇందులో మరో మాటే లేదు , ఒకవేళ క్రిష్ ఈ విషయం కాదని అంటే అతడు ఎక్కడైనా నిరూపించుకోవచ్చు లేదంటే అన్యాయం జరిగింది అని భావిస్తున్న వాళ్లతో కలిసి మళ్ళీ మణికర్ణిక తీసుకోవచ్చు అంటూ చులకనగా మాట్లాడింది వివాదాస్పద భామ కంగనా రనౌత్ . మణికర్ణిక చిత్రానికి దర్శకత్వం క్రిష్ వహించలేదని సవాల్ చేస్తోంది కంగనా .

అంతేకాదు క్రిష్ ఒక్కడి పైనే కాకుండా మా పాత్రలకు అన్యాయం జరిగింది అని మరికొంతమంది ఫీల్ అవుతున్నారు అలాంటి వాళ్లంతా కలిసి క్రిష్ తో కలవండి అంటూ పూచిక పుల్లలా తీసి పడేసింది కంగనా రనౌత్ . మొత్తానికి ఈ వ్యవహారంలో క్రిష్ క్రెడిట్ సంగతి పక్కన పెడితే మరింతగా నాశనం అయ్యింది అతడి ఇమేజ్ . ఒకవైపు ఎన్టీఆర్ కథానాయకుడు అట్టర్ ప్లాప్ కావడం , మరోవైపు మణికర్ణిక విషయంలో ఉన్న క్రెడిట్ పోవడమే కాకుండా అవమానాలకు గురి చేయడంతో క్రిష్ పరువు గంగలో కలిసింది.

English Title: Kangana ranaut strong warning to krish