కంగనా రనౌత్ కొత్త సినిమా “పంగా”


 

Kangana Ranaut’s new movie Panga movie new
Kangana Ranaut’s new movie Panga movie new

కంగనా రనౌత్ విషయానికి వస్తే, మొదటినుండి ఈమెది ముక్కుసూటి మనస్తత్వం. అసలు బాలీవుడ్ లో ప్రతిదానికి హీరోల డామినేషన్ విషయంలో మొదట వాయిస్ రైజ్ చేసిన వ్యక్తి కంగనా. ఇక ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇక మణికర్ణిక సినిమా విషయంలో కొన్ని సీన్లు డైరెక్షన్ చేసుకున్నాని, డైరెక్టర్ గా తన పేరు కూడా వేసుకుంది. దర్శకుడు క్రిష్ అనుకోకుండా ఎన్టీఆర్ బయోపిక్ చెయ్యవలసి రావడంతో, మణికర్ణిక సినిమా కొంత పార్ట్ కంగనా డైరెక్ట్ చేసిందని కొంతమంది వాదన. ఇక టైటిల్ క్రెడిట్ ఆమెకు ఎలాగు ఉంది కదా, ఆ మాత్రానికే దర్శకుడి పక్కన పేరు వేసుకోవడం ఏంటి.? అని కొంతమంది అన్నారు. ఇక తను మాట్లాడితే మళ్ళీ “మణికర్ణిక ” సినిమా ఇంకా వివాదాలతో చులకన అవుతుందని దర్శకుడు క్రిష్ ఏమీ మాట్లాడలేదు.

ఇప్పుడు ప్రస్తుతం కంగనా “పంగా” అనే సినిమా చేస్తోంది. ఇక ఈ సినిమాలో ఆమె కబడ్డీ ప్లేయర్ జయ నిగం పాత్రలో నటిస్తోంది. రైల్వే లో ఉద్యోగం చేసే ఆమె 32 ఏళ్ళ వయసులో మళ్ళీ కబడ్డీ ఆట మొదలుపెట్టి, తన చుట్టూ ఉన్న పరిస్థితులను దాటుకుని, లైఫ్ లో మళ్ళీ ఎదురైన సవాళ్ళను ఎలా ఎదుర్కొని విజయం సాధించింది.? అనేది ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాలో ఒక కబద్దె ప్లేయర్ గా, ఒక గృహిణిగా , ఒక తల్లిగా కంగనా నట విశ్వరూపం మనకు కనపడుతుంది.

మొత్తానికి ఈ జనవరిలో రొటీన్ కమర్షియల్ సినిమాల మధ్యలో ఈ సినిమా నిజమైన మూవీ లవర్స్ కి ఒక ట్రీట్ లాగా ఉంటాయి. ఈ ప్రపంచంలో అందరికన్నా, ఒక మహిళ ఎదుర్కునే కష్టాలు తలుచుకుంటే మాత్రం కె.జి.ఎఫ్ లో “ఈ ప్రపంచంలో అమ్మ కంటే గొప్ప యోధులు ఎవరూ ఉండరు” అన్న మమత నిజం అనిపిస్తుంది. “పంగా” సినిమాలో కూడా హీరోయిన్ తన ఫ్రెండ్ తో మళ్ళీ జీవితంలో ఛాలెంజ్ లు మొదలయ్యాయి…” అంటే హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ తో అనే మాట “అసలు అమ్మాయి జీవితమే ఒక ఛాలెంజ్ కదా …” అనే డైలాగ్ మాత్రం అద్భుతం.