కంగ‌న సెక్యూరిటీ ఖ‌ర్చు అంతా?


కంగ‌న సెక్యూరిటీ ఖ‌ర్చు అంతా?
కంగ‌న సెక్యూరిటీ ఖ‌ర్చు అంతా?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా పెను దుమారాన్ని సృష్టించాయి. ముంబై పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లా మారింద‌ని కంగ‌న చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే రేపాయి. ఈ వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్, మ‌రో ఎమ్మెల్యే ఘాటుగా స్పందించడంతో వివాదం కాస్త శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌గా మారింది.

దీంతో కంగ‌న‌కు కేంద్రం సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సి వ‌చ్చింది. ముంబైలో కంగ‌న ఈ నెల 9న అడుగు పెడుతున్నాన‌ని శివ‌సేన‌కు స‌వాల్ విస‌ర‌డంతో ముంబైలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. క‌ర్ణిసేన‌తో పాటు కంగ‌న‌కు ముంబైలో కేంద్రం భ‌ద్ర‌తా సిబ్బందిని ఏర్పాటు చేసింది. దీంతో శివ‌సేన సైలెంట్ అయిపోయింది. ఇదిలా వుంటే కంగ‌న సెక్యూటిరీ ఖ‌ర్చు ఎంత? ఆ ఖ‌ర్చు భ‌రిస్తోంది ఎవ‌రు? అన్న చ‌ర్చ మొద‌లైంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం కంగ‌న సెక్యూరిటీ నెల ఖ‌ర్చు 10 ల‌క్ష‌ల‌ని తెలిసింది. ఈ భారీ మొత్తాన్ని కంగ‌న భ‌రించ‌డం లేద‌ట‌. షాకింగ్ విష‌యం ఏంటంటే ఈ మొత్తాన్ని కేంద్ర‌మే భ‌రిస్తున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. శివ‌సేన‌పై కంగ‌న రంకెలేస్తుండ‌టంతో కంగ‌న బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ వాతావ‌ర‌ణాన్ని త‌న‌కు అనుకూలంగా వాడుకోవాల‌ని కేంద్రంలో వున్న‌ బీజేపీ ప్ర‌భుత్వం కంగ‌న భ‌ద్ర‌త ఖ‌ర్చుల్ని భ‌రిస్తున్న‌ట్టు  వార్త‌లు వినిపిస్తున్నాయి.