ఆ పాత్ర చేయటం గొప్ప కాదు.. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారికి రావటమే గొప్ప

ఆ పాత్ర చేయటం గొప్ప కాదు.. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారికి రావటమే గొప్ప
Prakash Raj

బాలీవుడ్ స్టార్ టాప్ హీరోయిన్ లో ఒకలు ‘కంగనా రనౌత్’ గారు ఒకలు. ఈమె చేసే సినిమాలోని పాత్రలు నిజానికి దగ్గరగా, సినిమా నేటివిటీ వి తగిన విధంగా ఉంటాయి. అందుకే ఇమె సినిమాలు కూడా పలు పెద్ద హీరోల మార్కెటింగ్ ని చేదిస్తాయి. అందుకు ఉదాహరణ ‘క్వీన్’, ‘తను వెడ్స్ మను’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ మరియు ‘షూట్ అవుట్ యట్ వాదాల’, ‘సిమ్రాన్’ మరియు ‘వన్స్ అప్ ఆన్ అ టైం ఇన్ ముంబాయి’. ఇవన్ని కంగనా రనౌత్ సృష్టించిన రికార్డులు.

అందుకే తమిళ దర్శకులు ఏ.ఎల్.విజయ్ గారు దివంగత ముఖ్యమంత్రి అయిన ‘జయలలిత’ గారి బయోపిక్ ని రూపొందిస్తున్నారు. బాల్యం నుండి నటి, నటి దగ్గరనుండి రాజకీయాలు అనే ఇతివృత్తం మీద జయలలిత గారి గురించి సినిమాలో చుపించబోతున్నారు. సినిమాలో ఎంజీఆర్ పాత్రకి నటులు ‘అరవింద్ స్వామి’ ని అనుకున్న వీరు ఇప్పుడు కరుణానిధి పాత్రకి ఒక టాలెంటెడ్ యాక్టర్ ని తిసుకోనున్నారు సినిమా సభ్యులు.

ఆయన ఎవరో కాదు… మనకి ఇష్టమైన నటులు ప్రకాష్ రాజు గారు. అవును ప్రకాష్ రాజు గారిని సినిమాలో కరుణానిధి పాత్రకి కావాలని సెలెక్ట్ చేసారు అంటున్నారు తమిళ సినిమా పరిశ్రమ వాళ్ళు. కారణం ఏంటంటే ఇదివరకే కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజు గారు 1997 సంవత్సరంలో మణిరత్నం రూపొందించిన ‘ఇరువర్’ చిత్రంలో నటించారు. ఇరువర్ చిత్రంలో మోహన్ లాల్ గారు కథ నాయకులు. కరెక్ట్ గా 22 సంవత్సరాల క్రితం విడుదల అయిన అ సినిమా పాత్ర ఇప్పటికీ మర్చిపోలేక పోవడానికి కారణం ప్రకాష్ రాజు గారి నటన.

అయితే మరి జయలలిత జీవితంలో కరుణానిధి పాత్ర నెగెటివ్ కారక్టర్ గా చూపించాలి కాబట్టి మరి ఈ కినిమాలో ప్రకాష్ రాజు గారిని విజయ్ గారు ఎలా చూపించబోతారో? విష్ణు ఇందూరి కినిమాని నిర్మిస్తున్నారు. తమిళంలో ‘తలైవి’ గా రానున్న సినిమా తెలుగు, హిందీ లో ‘జయ’ పేరుతో విడుదల చేయబోతున్నారు.