బాలీవుడ్ సింగర్ కు కరోనా తగ్గడం లేదట


 

Kanika Kapoor test corona positive again
Kanika Kapoor test corona positive again

కనికా కపూర్.. కరోనా వైరస్ కు ముందు వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. సన్నీ లియోన్ హీరోయిన్ గా బేబీ డాల్ పాట వంటివి కొన్ని పాడింది కానీ దానివల్ల వచ్చిన ఫేమ్ తక్కువే. అయితే కనికా కపూర్ పేరు కరోనా తర్వాత మార్మోగిపోయింది. విదేశాల నుండి వచ్చి ట్రావెల్ హిస్టరీ దాచి పెట్టడం, విమానాశ్రయంలో పోలీసుల కళ్ళు గప్పి బయట తిరగడం, ఐసోలేషన్ రూల్స్ ను తుంగలో తొక్కి పార్టీలకు అటెండ్ అవ్వడం, మహామహులతో కలిసి చేసుకున్న ఆ పార్టీల తర్వాత కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అందరిలో ఒక్కసారిగా కంగారు మొదలైంది. కనికా వ్యవహార శైలిపై పెద్ద దుమారమే రేగింది. ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్స్ కూడా వినిపించాయి.

వైద్యం కోసం కనికా హాస్పిటల్ లో జాయిన్ అయినా కానీ ఆమె స్వభావం మారలేదు. హాస్పిటల్ లో అందించే ఫుడ్ బాలేదని, అక్కడి వసతులు సరిగా లేవని ఆరోపణలు చేసింది. దానికి ఆ హాస్పిటల్ హెడ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆమెకు ఏసీ రూమ్ ఇచ్చామని, ఫుడ్ లో కూడా బెస్ట్ క్వాలిటీ అందిస్తున్నామని, ఆమె ఒక సెలబ్రిటీలా కాకుండా పేషెంట్ లా ప్రవర్తిస్తే బాగుంటుందని వివరించాడు.

అయితే అప్పటి నుండి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికి మూడు సార్లు ఆమెకు కరోనా టెస్ట్ చేయగా మూడు సార్లూ పాజిటివ్ అని తేలింది. రీసెంట్ గా నాలుగోసారి చేస్తే అప్పుడు కూడా పాజిటివ్ అనే వచ్చింది. అయితే ఆమెకు ఎందుకని తగ్గడం లేదన్నది అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే డాక్టర్లు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమెకు ఎన్ని సార్లు పాజిటివ్ అని వచ్చినా కానీ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు. అయితే ఎందుకని పదే పదే పాజిటివ్ ఎందుకు వస్తోందో అర్ధం కావడం లేదని అంటున్నారు. అయితే ఆమెకు అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు మాత్రం తెలిపారు.