క‌రోనా కాటుకు మ‌రో న‌టుడు బ‌లి!క‌రోనా కాటుకు మ‌రో న‌టుడు బ‌లి!
క‌రోనా కాటుకు మ‌రో న‌టుడు బ‌లి!

క‌రోనా వైరస్ సినీ ఇండ‌స్ట్రీని తీవ్ర సంక్షోభం లోకి నెట్టేసింది. షూటింగ్‌లు మ‌ధ్య‌లో ఆగిపోవ‌డంతో కింది స్థాయి కార్మికులతో పాటు కోట్లు వెచ్చించిన నిర్మాత‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సినీ ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది న‌టీన‌టులు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు క‌రోనా బారిన ప‌డి  మృత్యువాత పడుతున్నారు. బాలీవుడ్ ఇండ‌స్ట్రీతో పాటు క‌న్న‌డ ఇండ‌స్ట్రీ క‌రోనా కార‌ణంగా ప‌లువురు న‌టుల‌ని కోల్పోతోంది. తాజాగా క‌న్న‌డ న‌టుడు హులివానా గంగాధ‌ర్ (70)కు క‌రోనా సోకింది.

కొంత కాలం ఇంట్లోనే వుండి చికిత్స తీసుకున్న హులివానా గంగాధ‌ర్ కు ఇటీవ‌ల శ్వాస తీసుకోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు త‌లెత్తాయ‌ట‌. దీంతో బెంగ‌ళూరులోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేశారు. ఈ క్ర‌మంలో ఆరోగ్య్ ప‌రిస్థితి విష‌మించ‌డంతో శ‌నివారం సాయంత్రం ఆయ‌న తుది శ్వాస విడిచిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. హులివానా గంగాధ‌ర్ కు భార్య‌, ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు వున్నారు.

120 చిత్రాల్లో న‌టించిన హులివానా గంగాధ‌ర్ మృతి ప‌ట్ల క‌న్న‌డ సినీ వ‌ర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశాయి. 127 స్టేజ్ షోల్లో హులివానా గంగాధ‌ర్ పాల్గొన్నార‌ని, ఆయ‌న స్నేహితుడు వెల్ల‌డించారు. క‌రోనా తీవ్ర రూపం దాల్చ‌డంతో బెంగ‌ళూరులో ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది.