మోడల్ నివాడుకున్న నటుడి అరెస్ట్


kannada actor kiran raj arrested in assault caseప్రేమ పేరుతో మోడల్ తో అయిదేళ్ల పాటు సహజీవనం చేసి ఆమెని పూర్తిగా అనుభవించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోజు తీరగానే ఆమె ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు ఓ బుల్లితెర నటుడు దాంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు నటుడిని బెంగుళూర్ పోలీసులు అరెస్ట్ చేసారు . సంఘటన పూర్వాపరాలలోకి వెళితే …… కిరణ్ రాజ్ అనే కన్నడ బుల్లితెర నటుడు ముంబై కి చెందిన మోడల్ ని ప్రేమించాడు .

ఇద్దరికీ ఇష్టం కావడంతో దాదాపు అయిదేళ్ల పాటు సహజీవనం చేసారు . సహజీవనం పేరుతో ఆ మోడల్ ని పూర్తిగా అనుభవించాడు బుల్లితెర నటుడు కిరణ్ రాజ్ . అయితే ఆమెపై మోజు తీరగానే పెళ్లి అని ఆ మోడల్ వెంటపడుతుంటే దాటవేస్తూ వచ్చాడు . దాంతో సదరు మోడల్ కిరణ్ రాజ్ ని నిలదీయగా ఆమెపై దాడి చేసాడు . ఇక చేసేది లేక పోలీసులను ఆశ్రయించింది . మోడల్ ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు కిరణ్ రాజ్ ని అరెస్ట్ చేసారు .