ఆ హీరో కాపురంలో నిప్పులు


Kannada actors Darshan latest news
Kannada actors Darshan latest news

కన్నడ హీరో దర్శన్ కాపురంలో నిప్పులు పోశారు.

ఈ హీరో కాపురం ఇప్పుడు రోడ్డున పడింది . విజయలక్ష్మి ని పెళ్లి చేసుకున్న దర్శన్ కొంతకాలం సజావుగానే కాపురం చేసారు.

అయితే ఓ హీరోయిన్ తో దర్శన్ సన్నిహితంగా ఉంటున్నాడన్న గుసగుసలు ఫిలిం ఇండస్ట్రీలో వినిపించడంతో అలాగే ఆ హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫోటోలు ప్రత్యక్షం కావడంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి .

అయితే కొంతమంది సినీ ప్రముఖులు జోక్యం చేసుకోవడంతో మళ్ళీ దర్శన్ – విజయలక్ష్మి ఒక్కటయ్యారు.

కట్ చేస్తే తాజాగా ఈ ఇద్దరి మధ్య మళ్ళీ లొల్లి మొదలయినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే విజయలక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో తన పేరు పక్కన ఉన్న భర్త పేరు తొలగించింది.

దాంతో మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు స్పష్టం అవుతోంది.

అయితే ఈ గొడవలు సద్దుమణిగేది ఎప్పుడో ? వీళ్ళ కాపురం చక్కదిద్దుకునేది ఎప్పుడో ?