స్టార్ హీరో అభిమాని ఆత్మహత్యాయత్నం


Kannada hero Yash fan suicide attempt

కన్నడ స్టార్ హీరో యష్ వీరాభిమాని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ఘటన సంచలనం సృష్టించింది కర్ణాటకలో . క్రేజీ హీరో యష్ నటించిన కేజీఎఫ్ ఇటీవలే సంచలన విజయం సాధించిన నేపథ్యంలో యష్ ఇంటికి పెద్ద ఎత్తున తరలివచ్చారు అభిమానులు . పైగా నిన్న యష్ పుట్టినరోజు కూడా అయితే అందులో శాంతినగర్ కు చెందిన రవి యష్ ని చూడటానికి వచ్చాడు . అయితే సెక్యూరిటీ సిబ్బంది రవి ని వెళ్లగొట్టడంతో అవమానంగా భావించి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు .

వెంటనే అందరూ అప్రమత్తమై మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేసారు కానీ పెట్రోల్ కావడంతో భగభగ మండిపోయాడు . మొత్తానికి మంటలను ఆర్పేసి ఆసుపత్రికి తరలించారు కానీ 75 శాతం కాలిన గాయాలతో నరక యాతన అనుభవిస్తున్నాడు రవి . యష్ అభిమాని రవి పరిస్థితి పూర్తిగా ఆందోళన కరంగా ఉందని తెలిపారు డాక్టర్లు . యష్ అభిమాని అయిన రవి ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే పెట్రోల్ తెచ్చుకొని ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు .

English Title: Kannada hero Yash fan suicide attempt

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w&layout=gallery[/embedyt]