`క‌ప‌ట‌ధారి` టీజ‌ర్‌: రేసీ కాప్ థ్రిల్ల‌ర్


kapatadhari teaser - a racy cop thriller
kapatadhari teaser – a racy cop thriller

హీరో సుమంత్ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. త‌న‌కు న‌చ్చితే గానీ న‌టించ‌డం లేదు. సినిమాలు చాలా వ‌ర‌కు త‌గ్గించుకుంటున్నారు. అందుకే రెండేళ్ల‌కు ఒక మూవీతో ఆడియ‌న్స్ ముందుకు వ‌స్తున్నారు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `క‌ప‌ట‌ధారి`. ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ద‌ర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్నారు. డా. ధ‌నుంజ‌య‌న్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ  టీజర్‌ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు.

‘ఈ ప్రపంచంలో ఒక ప్రయోజనం లేకుండా ఏమీ జరగదు’ అంటూ సుమంత్ చెప్పిన డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభమవుతుంది. అయితే విజువల్స్‌లో ఓ హ‌త్య చుట్టూ క‌థ న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇందులో ట్రాఫిక్ పోలీస్ ఆఫీస‌ర్‌గా సుమంత్ న‌టిస్తున్నారు. హ‌త్య మిస్టరీని ఛేధించే క్ర‌మంలో వున్న ఇన్వెస్టిగేటివ్ పోలీస్ బృందంలో తాను చేర‌తాన‌ని సుమంత్ ఆస‌క్తిని చూపిస్తుంటే మ‌రో సారి ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేయొద్దంటూ సివిల్ పోలీస్‌లు హెచ్చ‌రిస్తున్న తీరు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

అయినా అవ‌న్నీ లెక్క‌చేయ‌కుండా సుమంత హ‌త్య కేసుని ఒంట‌రిగా ఛేదించ‌డం మొద‌లుపెడ‌తాడు. ఆ క్ర‌మంలో ఏం జ‌రిగిది అన్న‌దే ఆస‌క్తిక‌రం. మంట‌ల్లో కాల‌పోతున్న ఓ కార్‌… చిన్న పిల్ల‌ల అస్థిపంజ‌రం.. వంటి ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగింది. నందిత శ్వేత, నాజ‌ర్, జయప్రకాష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.