పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం చేస్తున్నాడట


kapunadu leader sensational comments on pawan kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు కులస్థులకు తీరని నమ్మక ద్రోహం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ కాపునాడు అధ్యక్షుడు పిళ్ళా వెంకటేశ్వర్రావు . బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో హామీలను ఇచ్చి అమలు పరచకపోగా పవన్ కళ్యాణ్ ని అడ్డుపెట్టుకొని ఆరోపణలు చేయించడం , బిజెపి ఆడమన్నట్లు పవన్ కళ్యాణ్ ఆడుతూ చంద్రబాబు ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ మరోసారి కాపులను మోసం చేయడానికే పూనుకున్నట్లు కనిపిస్తోందని అన్నారు .

 

ఇప్పటికే చిరంజీవి రూపంలో కాపులు తల ఎత్తుకోలేక పోతున్నారని ఇక ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి కాపులకు నమ్మక ద్రోహం చేయడానికి వచ్చాడని అంటున్నాడు కాపునాడు నేత . కేంద్ర ప్రభుత్వం పై పోరాడుతున్న చంద్రబాబు కు మద్దతు ఇవ్వాల్సిన ఈ తరుణంలో పవన్ వ్యవహారశైలి కంపరంగా ఉందని అన్నారు పిళ్ళా వెంకటేశ్వర్ రావు .