క‌ర‌ణ్ జోహార్ థ్రిల్ల‌య్యార‌ట‌!


క‌ర‌ణ్ జోహార్ థ్రిల్ల‌య్యార‌ట‌!
క‌ర‌ణ్ జోహార్ థ్రిల్ల‌య్యార‌ట‌!

`బాహుబ‌లి` త‌రువాత బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూస‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్‌జోహార్ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న చిత్రం `ఫైట‌ర్‌`. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్నిపాన్ ఇండియా లెవెల్లో భారీగా తెర‌పైకి తీసుకురాబోతున్న విష‌యం తెలిసిందే. `ఇస్మార్ట్ శంక‌ర్` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత రెట్టించిన ఉత్సాహంతో వున్న పూరి జ‌గ‌న్నాథ్ `ఫైట‌ర్` చిత్రాన్నిక‌ర‌ణ్‌జోహార్‌, చార్మి, అపూర్వ మెహ‌తాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ సోమ‌వారం ముంబైలో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి చార్మి క్లాప్ నిచ్చారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా కోసం జాన్వీక‌పూర్‌ని హీరోయిన్‌గా ఫిక్స్ చేస్తే ప్రాజెక్ట్‌పై మ‌రింత క్రేజ్ పెరుగుతుంద‌ని పూరి భావిస్తున్నారు. కానీ అది జ‌రిగే ప‌నిలా క‌నిపించ‌డం లేదు. దీంతో అన‌న‌య్య‌పాండేని రంగంలోకి దింపేస్తున్నార‌ట‌.

మిక్స్డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమా సెట్ కావ‌డం ప‌ట్ల బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్‌జోహార్ థ్రిల్ ఫీల‌య్యార‌ట‌. ఇదే విష‌యాన్ని ఆయన ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఈ చిత్రానికి భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని, ఈ జ‌ర్నీత‌న‌ని థ్రిల్‌కి గురిచేస్తోందని,  ఈ సంద‌ర్భంగా `ఫైట‌ర్‌` టీమ్‌కి బెస్ట్ ఆఫ్ ల‌క్ చెప్పారు క‌ర‌ణ్ జోహార్‌. దీనికి పూరి  `స‌ర్‌జీ ధ‌న్య‌వాదాలు. నేను కూడా సూప‌ర్ ఎక్సైట్ అవుతున్నాను. అని రిప్లై ఇచ్చారు.