బాలీవుడ్ బొమ్మాలి వచ్చేస్తుంది.


Kareena Kapoor
బాలీవుడ్ బొమ్మాలి వచ్చేస్తుంది.

బాహుబలి ఎప్పిడితే పలు భాషల్లో రిలీజ్ అయిందో, మన తెలుగు సినిమాల మీద ప్రభావం గట్టిగా పడింది. పాత సినిమాలని కూడా వెలికితీసి బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ఇప్పుడు ఒకటి రీమేక్ చేస్తున్నాం అంటూ వార్త బయటికి వచ్చింది.

బహుశా ఈ రోజు అనగా 21 సెప్టెంబర్ బాలీవుడ్ నటి “కరీనా కపూర్” పుట్టిన రోజు కానుకగా, తనకి నిర్మాతలు ఎవరైనా గిఫ్ట్ గా ఇద్దాం అని మాట అనుకున్నారు ఏమో గాని, మన “అరుంధతి” మూవీ ని బెబో తో తీయించాలి అని అనుకుంటున్నారు అంటా. అలా అయితే నిజంగా ఇది మా హీరోయిన్ గారి పుట్టిన రోజుకి శుభవార్త అని బెబో ఫాన్స్ అంటున్నారు.

ఎప్పుడో పది సంవత్సారాల క్రితం వచ్చిన ఈ సినిమా ని ఇప్పుడు రీమేక్ చెయ్యడం ఏంటి అనుకుంటున్నారా? అసలు అరుంధతి వచ్చిన ఏడాదికి రీమేక్ చేయాలి అనుకున్నారు కానీ అప్పుడు మన తెలుగు సినిమాలు అక్కడ రీమేక్ చేస్తే ఆడేవి కావు, అలా అరుంధతి సినిమాని ఎవ్వరు రీమేక్ చెయ్యాలి అనుకోలేదు. మొదట ఇద్దరు హీరోయిన్స్ ని అనుకోని సంప్రదించి కథ చెప్పి ఒప్పిద్దాం అనుకోని సినిమా రైట్స్ కూడా కొన్నారు, కానీ ఫలితం లేదు.

ఇప్పుడైతే బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమాలు బాగా పాపులర్ అవుతున్నాయి కాబట్టి, ఇక్కడి సినిమాలు, సినిమాలలోని కథలని చూసి అవసరమైతే రీమేక్ చేద్దాం అని కూడా అనుకుంటున్నారు.

అలా మన బెబో పుట్టిన రోజు ఒక మంచి వార్త వచ్చింది, ఇక బెబో గారు కూడా సినిమా చూడటం జరిగింది, సినిమా రీమేక్ చెయ్యడానికి తనకి ఏం అభ్యతరం లేదు అని కూడా చెప్పిందంటే సినిమా మీద నమ్మకం అని చెప్పాలి.

చూద్దాం బాలీవుడ్ బొమ్మాలి గా బెబో గారు ఎలా బయపెడుతుందో? అలాగే మన అందరి తరపునా కరీనా కపూర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.