మహేష్ పై ఆగ్రహంగా ఉన్న కర్ణాటక ప్రేక్షకులు


Karnataka people say #BharathAneNenu boycottమహేష్ బాబు పై కర్ణాటక ప్రేక్షకులు చాలా ఆగ్రహంగా ఉన్నారు . భరత్ అనే నేను విడుదలైన ఈ సమయంలో మహేష్ పై కన్నడ ప్రేక్షకులకు ఎందుకు ఆగ్రహం అని అనుకుంటున్నారా ? భరత్ అనే నేను సినిమా వల్లే ఈ పరిస్థితి . ఇంతకీ మహేష్ పై కోపానికి కారణం ఏంటంటే ……. భరత్ అనే నేను సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమాన దేవుళ్ళకు కృతఙ్ఞతలు అంటూ ట్వీట్ చేయడమే !

అందరికీ కృతఙ్ఞతలు అంటూ చేసిన ట్వీట్ లో తెలుగు ప్రేక్షకుల తో పాటుగా తమిళ , మలయాళ , భాషలతో పాటుగా హిందీలో కూడా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసాడు కానీ కన్నడ భాషలో ట్వీట్ చేయడం మర్చిపోయాడు దాంతో కన్నడ ప్రేక్షకులు అంటే అంత చులకనా అంటూ మహేష్ పై ఆగ్రహంతో ఊగిపోయారు అంతేకాదు భరత్ అనే నేను చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలనీ పిలుపునిచ్చారు కూడా . అయితే ఈ విషయం మహేష్ కు తెలియడంతో తన పొరపాటుని సరిదిద్దుకొని కన్నడ భాషలో మళ్ళీ ట్వీట్ చేసాడు దాంతో కన్నడ ప్రేక్షకులు శాంతించారు .