కాలా సినిమాని రిలీజ్ కానివ్వరట అక్కడ


సూపర్ స్టార్ రజనీకాంత్karnataka peoples angry on rajnikanth కాలా చిత్రం జూన్ 7న విడుదల కానున్న విషయం తెలిసిందే . రజనీకాంత్ సినిమా అంటే ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది ఎందుకంటే అంతటి క్రేజ్ ఉంది రజనీ కి . కాలా చిత్రం కోసం అప్పుడే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు అయితే ప్రపంచ వ్యాప్తంగా కాలా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు కానీ కర్ణాటకలో మాత్రం రజనీ చిత్రానికి కష్టాలు వచ్చేలా ఉన్నాయి ఎందుకంటే కొంతమంది కన్నడ వాసులు కాలా చిత్రాన్ని విడుదల కానివ్వమని సవాల్ విసురుతున్నారు .

రజనీకాంత్ పై కన్నడ వాసులకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ……. కావేరీ నీటిని తమిళనాడు కు విడుదల చేయాలనీ డిమాండ్ చేయడమే ! స్వతహాగా రజనీకాంత్ కర్ణాటక వాసి అయితే తమిళ సినీ రంగం ఆదరించి సూపర్ స్టార్ ని చేసింది . కర్ణాటక వాసి అయినప్పటికీ ఇక్కడి విషయాలు పట్టించుకోకుండా తమిళుల ప్రయోజనం కోసం పాటు పడటం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అందుకే కాలా చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కానివ్వమని హెచ్చరికలు జారీ చేసున్నారు .