`లింగోచ్చా` సెకండ్ సాంగ్‌ వ‌చ్చేసింది!


`లింగోచ్చా` సెకండ్ సాంగ్‌ వ‌చ్చేసింది!
`లింగోచ్చా` సెకండ్ సాంగ్‌ వ‌చ్చేసింది!

`కేరాఫ్ కంచ‌ర పాలెం` వంటి చిత్రంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నకార్తీక్ ర‌త్నంని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ శ్రీ‌క‌ళ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న చిత్రం `లింగోచ్చా`. ఆనంద్ బ‌డా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బ్లాక్ బాక్స్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో యాద‌గిరి రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపార్ద్యేసింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ సాంగ్‌ని హీరో సాయి‌తేజ్ విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇటీవ‌లే ఫ‌స్ట్ సింగిల్‌ని విడుద‌ల చేశారు. తాజాగా విడుద‌ల చేసిన సెకండ్ సింగిల్ `నూర్జా`పాట ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌కి ర‌చ‌న ఉద‌య్ మ‌దినేని, సంగీతం అండ్ గానం బికాజ్ రాజ్, కొరియోగ్ర‌ఫీ భాను. మాట‌లు ఉద‌య్ మాదినేని. విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌గా రూపొందుతున్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా నిర్మాత‌లు ధీమాని వ్య‌క్తం చేస్తున్నారు.

బేబీ ఫిదా మొగ‌ల్, మాస్ట‌ర్ ప్రేమ్ సుమ‌న్‌, ఉత్తేజ్‌, తాగుబోతు ర‌మేష్‌, కునాల్ కౌశిక్‌, బ‌ల్వీంద‌ర్‌సింగ్‌, స‌ద్దామ్ హుస్సేన్‌, మిమిక్రీ మూర్తి, ధీర్ చ‌ర‌ణ్ శ్రీ‌వాస్త‌వ్, ఫిష్ వెంక‌ట్‌, ర‌వి శంక‌ర్, శోభారాణి త‌దిత‌రులు న‌టిస్తున్నారు.