అక్క … ఇద్దరు అమ్మలతో సమానం – కార్తీ “దొంగ” ట్రైలర్


Karthi New Movie Donga Trailer Released
Karthi New Movie Donga Trailer Released

అన్నా చెల్లి &అక్కా.. తమ్ముడు సెంటిమెంట్ అనే స్టోరీ లైన్ అనేది తెలుగు సినిమాలో కూడా ఎప్పటికీ ఎవర గ్రీన్ ఎలిమెంట్. సూపర్ స్టార్ మహేష్ బాబు గుణశేఖర్ దర్శకత్వం లో వచ్చిన అర్జున్ సినిమా తర్వాత తెలుగులో కూడా అక్కా, తమ్ముడు సెంటిమెంట్ మీద సినిమాలు రాలేదు.

ఈ సంవత్సరం “దేవ్” సినిమా నిరాశ పరిచినా, ఖైదీ సినిమాతో అటు తమిళంలో ఇటు తెలుగులో సెన్సేషనల్ హిట్ సాధించిన హీరో కార్తీ తన తరువాతి సినిమా విజయంతో ఈ సంవత్సారాన్ని ఘనంగా ముగించాలి అని భావిస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. తమిళంలో “తంబి” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దృశ్యం ఫేం జీతూ జోసెఫ్ దర్శకుడు. తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో కార్తీ మరియు జ్యోతిక తండ్రి పాత్రలో నటిస్తున్నారు.

ఇక ట్రైలర్ ని గమనిస్తే అనుకోని కారణాల వల్ల ప్రాణానికి ప్రాణంగా పెరిగిన అక్కా తమ్ముళ్ళు విడిపోతారు.15 ఏళ్ళ తరువాత తండ్రి ఒక వ్యక్తిని ఇంటికి తీసుకు వచ్చి తన కొడుకుగా తప్పిపోయిన చిన్ననాటి తమ్ముడుగా ఆ కుటుంబంలో అందరికీ పరిచయం చేస్తారు. కానీ కొంతమంది అతన్ని నమ్మరు.

“ఎలా ఉంది మన యాక్టింగ్.? బహుబలిలో అసలు మనల్ని పెట్టాలి .. ఎవరినో పెడుతున్నాడు రాజమౌళి” అని కార్తీ పాత్ర చెప్పడం, జ్యోతిక క్యారెక్టర్ కార్తీ ని మొదట తన తమ్ముడిగా నమ్మకపోవడం, పతాక సన్నివేశాలలో వాళ్ళు ఇద్దరూ కలవడం వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. తమిళ సంగీత సంచలనం గోవింద్ వసంత ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉండగా, ఎన్నో పెద్ద సినిమాలకు పని చేసిన R.D రాజశేఖర్ ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి కార్తీ తన విజయపరంపరను కొనసాగించాలని కోరుకుందాం.