కార్తీ `సుల్తాన్‌` ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

కార్తీ `సుల్తాన్‌` ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!
కార్తీ `సుల్తాన్‌` ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది!

`ఖైదీ`.. కార్తీ గ‌త ఏడాది న‌టించిన ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌‌మిది. హీరోయిన్ లేకుండా కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగే క‌థ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని లోకేష్ కన‌క‌రాజ్ తెర‌కెక్కించాడు. స్మ‌గ్ల‌ర్‌ల భారి నుంచి పోలీసుల్ని కాపాడే ఓ ఖైదీ క‌థ‌గా రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేస‌కుని కార్తీకి హిట్‌తో పాటు ప్ర‌శంస‌ల్ని అందించింది. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వ‌ర‌కు ఒకే ఒక్క డ్రెస్‌.. అది కూడా లుంగీ, చిరిగిన ష‌ర్ట్‌తో కార్తి న‌ట‌న అద్భుతం.

ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ త‌రువాత మ‌ళ్లీ ఇదే బ్యాన‌ర్‌లో కార్తి న‌టిస్తున్న చిత్రం `సుల్తాన్‌`. `రెమో` ఫేమ్ భాగ్య‌రాజ క‌న్న‌న్ ఈ చిత్రాన్ని తెర కెక్కిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని హీరో కార్తి రిలీజ్ చేశారు. ‌

‌హై టెన్ష‌న్ వైర్‌ని హంట‌ర్‌గా వాడుతున్న కార్తీ లుక్ టెర్రిఫిక్‌గా వుంది. `ప్ర‌య‌మైన స‌హోద‌ర స‌హోద‌రిలారా.. మీ ప్రేమ ప్ర‌శంస‌లే మ‌మ్మ‌ల్ని న‌డిపిస్తున్నాయి. `సుల్తాన్‌` ఫ‌స్ట్ లుక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకు న‌చ్చిద‌ని ఆశిస్తున్నాను` అని ట్వీట్ చేశాడు.