అందాలు ఆరబోసినా ఏం లాభం


karthika skin show90 వ దశకంలో హీరోయిన్ గా గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ రాధ , అయితే ఆ భామ కూతురు కార్తీక హీరోయిన్ గా పరిచయం అయ్యింది కానీ రాధలా ఆకట్టుకునే అందమైన రూపమ్ కాకపోవడంతో ఈ భామని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు దాంతో అటు తమిళనాట ఇటు తెలుగునాట కూడా కార్తీక కు సినిమాలు లేకుండా పోయాయి . తెలుగులో కానీ తమిళ్ లో కానీ ఎక్కడో ఒకచోట సక్సెస్ కాలేకపోతానా ? అని ఆశించింది కానీ రెంటికి చెడిన రేవడిలా తయారయ్యింది కార్తీక పరిస్థితి .

అయితే తాజాగా అందాలను ఆరబోస్తూ ఈ భామ ఓ ఫోటో షూట్ చేసింది , తనకు తెలిసిన వాళ్ళ ద్వారా మళ్ళీ హీరోయిన్ గా బిజీ కావాలని ఆశపడుతోంది కానీ ఇప్పుడు అందాలు ఆరబోసి ఏం లాభం ……. ప్రయోజనం లేదు అని అనేస్తున్నారు పలువురు . రాధ ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయారు .