నాగ్ బాట‌లో యంగ్ హీరో కార్తీకేయ‌!

నాగ్ బాట‌లో యంగ్ హీరో కార్తీకేయ‌!
నాగ్ బాట‌లో యంగ్ హీరో కార్తీకేయ‌!

కింగ్ నాగ్ త‌ర‌హాలోనే యంగ్ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ ఎన్‌.ఐ.ఏ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. నాగార్జున `వైల్డ్ డాగ్‌` చిత్రంలో ఎన్‌.ఐ.ఏ ఆఫీస‌ర్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో యువ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ కూడా ఎన్‌. ఐ.ఏ ఆఫీస‌ర్‌గా త‌న తదుప‌రి చిత్రంలో క‌నిపించ‌బోతున్నాడు. ఆయ‌న హీరోగా శ్రీ‌సరిప‌ల్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది.

ఆదిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ చిత్ర మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై 88 రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాన్య ర‌విచంద్ర‌న్ హీరోయిన్‌గా తెలుగు తెల‌ర‌కు ప‌రిచ‌యం అవుతోంది. సుధాక‌ర్ కోమాకుల కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే హైద‌రాద్‌లో మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఓ వీడియోని విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `ఇది కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇందులో కార్తికేయ ప‌వ‌ర్‌ఫుల్ ఎన్‌.ఐ.ఏ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఆయ‌న పాత్ర చాలా కొత్త‌గా వుంటుంది. ప్ర‌శాంత్ .ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే టైటిల్‌ని ప్ర‌క‌టిస్తాం` అన్నారు.

వి.వి.వినాయ‌క్ శిష్యుడు శ్రీ‌స‌రిప‌ల్లిని ఈ చిత్రం ద్వారా దర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాం. సూప‌ర్ స్టోరీ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌గం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రిగే షూటింగ్ 90 శాతం పూర్త‌వుతుంది.` అని నిర్మాత తెలిపారు. ఎన‌ర్జిటిక్ టీమ్‌తో యాంబీషియ‌స్ స్క్రిప్ట్‌తో నా త‌దుప‌రి చిత్రాన్ని చేస్తున్నాను. ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ అప్ డేట్ ఇదిగో` అని హీరో కార్తికేయ ట్వీట్ చేశారు.