బ‌స్తీబాల‌రాజు టీజ‌ర్ గ్లింప్స్ వ‌చ్చేస్తోంది!

బ‌స్తీబాల‌రాజు టీజ‌ర్ గ్లింప్స్ వ‌చ్చేస్తోంది!
బ‌స్తీబాల‌రాజు టీజ‌ర్ గ్లింప్స్ వ‌చ్చేస్తోంది!

యంగ్ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం `చావు క‌బురు చ‌ల్ల‌గా`. ఈ మూవీ ద్వారా కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై యువ నిర్మాత బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

ఈ మూవీకి సంబందించిన టీజ‌ర్ గ్లింప్స్ ఈ నెల 11న ఉద‌యం 10 గంట‌ల 56 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం శ‌నివారం ఓ పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.  ఈ పోస్ట‌ర్ లో కార్తికేయ ముడ‌త‌లు ప‌డిన డ్రెస్‌లో ఊర మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. లావ‌ణ్య త్రిపాఠి చీరెక‌ట్టులో క్లాస్‌గా క‌నిపిస్తోంది.

ఇందులో స్మ‌శానానికి శ‌వాల‌ని తీసుకెళ్లే వాహ‌నానికి డ్రైవ‌ర్‌గా కార్తికేయ ఓ విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. కార్తికేయ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన బాలరాజు లుక్ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచేసింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత బ‌న్నీవాసు మాట్లాడుతూ `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత గోవిందం, ప్ర‌తి రోజు పండ‌గే వంటి చిత్రాల త‌రువాత మా బ్యాన‌ర్‌లో సినిమా అంటే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కార్తికేయ న‌టించిన గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా వుంటుంది. అదే బ‌స్తీ బాల‌రాజు టీజ‌ర్‌లో ఊపించాం. లావ‌ణ్య త్రిపాఠి మ‌ల్లిక‌గా కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఈ చిత్ర టీజ‌ర్‌ని ఈ నెల 11న రిలీజ్ చేస్తున్నాం` అన్నారు.