వరదల్లో చిక్కుకున్న హీరో కార్తీ బృందం


Karthis dev shooting cancelled due to flood

తమిళ స్టార్ హీరో కార్తీ తాజాగా నటిస్తున్న చిత్రం షూటింగ్ ఆగిపోవడంతో ఆ చిత్ర నిర్మాత ఏకంగా కోటిన్నర రూపాయలు నష్టపోయాడు దాంతో ఆ నిర్మాత లోలోన కుమిలిపోతున్నాడట ! కార్తీ తాజాగా ” దేవ్ ” అనే తమిళ చిత్రంలో నటిస్తున్నాడు , యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో హాట్ భామ రకుల్ ప్రీత్ సింగ్ కార్తీ సరసన నటిస్తోంది . ఇంతకుముందు కార్తీ – రకుల్ కలిసి ఖాకీ చిత్రంలో నటించగా ఆ చిత్రం బాగానే ఆడింది . దాంతో మళ్ళీ ఆ భామనే పెట్టుకున్నాడు ఈ హీరో . దేవ్ కూడా యాక్షన్ చిత్రం కావడంతో షూటింగ్ నిమిత్తం కులుమనాలి వెళ్లారు .

అయితే అక్కడ భారీ వర్షాలతో పాటుగా , భారీ వరదలు వస్తున్నాయి ….. ఆ వరదల వల్ల షూటింగ్ ఆగిపోయింది . షూటింగ్ లో పాల్గొనాల్సిన యూనిట్ 140 మంది వరదల్లో చిక్కుకున్నారు దాంతో షూటింగ్ లేకుండా పోయింది అయితే షూటింగ్ రద్దు అయినప్పటికీ బేటా లు , తిండి , బస ఖర్చులు కామన్ కాబట్టి అవన్నీ తడిసి మోపెడు అయ్యాయట ! ఒక కోటి యాభై లక్షల రూపాయలు అప్పనంగా ఖర్చు కావడంతో లక్ష్మణ్ అనే నిర్మాత ఒకింత భయపడిపోయాడట కూడా . హీరో కార్తీ తో పాటుగా యూనిట్ అంతా వరదల్లో చిక్కుకున్నప్పటికీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వరదలు తగ్గుముఖం పడితే మళ్ళీ షూటింగ్ చేసుకోవచ్చని అంటున్నాడట సదరు నిర్మాత .

English Title: Karthis dev shooting cancelled due to flood