దేవ్ టీజర్ వచ్చేసింది


Karthi's DEV teaser talk

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన దేవ్ టీజర్ వచ్చేసింది . రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ దేవ్ చిత్రం ఎప్పటి లాగే తెలుగు , తమిళ బాషలలో విడుదల చేయనున్నాడు కార్తీ . రకుల్ ప్రీత్ సింగ్ తో కార్తీ నటించిన ” ఖాకీ ” చిత్రం సూపర్ హిట్ కావడంతో మళ్ళీ రకుల్ ని తీసుకున్నాడు ఈ దేవ్ చిత్రానికి . రజత్ రవిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించగా హరీష్ జై రాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు . ఇక దీపావళి పండగ సందర్భాన్ని పురస్కరించుకొని దేవ్ టీజర్ ని విడుదల చేసారు .

టీజర్ లో కార్తీ చాలా స్టైలిష్ గా ఉన్నాడు అంతేకాదు తన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పకనే చెప్పాడు టీజర్ లో . అందరిలా అందరి మెప్పు కోసం ఉద్యోగం చేసే టైపు కాదని జీవితమంటే ఎంజాయ్ చేయడమే అని చాటి చెబుతున్నాడు కార్తీ . ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచిన ఈ దేవ్ తాజాగా టీజర్ తో మరోసారి మెప్పించాడు . యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కార్తీ చాలా ఆశలు పెట్టుకున్నాడు పైగా తనకు అచ్చి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కావడంతో మరో హిట్ ఖాయమని ధీమాగా ఉన్నాడు .

English Title: Karthi’s DEV teaser talk