`సుల్తాన్ టీజ‌ర్ టాక్ : కృష్ణుడే కౌర‌వుల‌వైపుంటే!

`సుల్తాన్ టీజ‌ర్ టాక్ : కృష్ణుడే కౌర‌వుల‌వైపుంటే!
`సుల్తాన్ టీజ‌ర్ టాక్ : కృష్ణుడే కౌర‌వుల‌వైపుంటే!

కార్తి హీరోగా న‌టిస్తున్న త‌మిళ చిత్రం `సుల్తాన్‌`. భాగ్య‌రాజ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క్రేజీ క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆర్‌.ఎస్‌. ప్ర‌కాష్‌, ఆర్‌.ఎస్‌. ప్ర‌భు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులోనూ ఈ మూవీ ఇదే పేరుతో విడుద‌ల కానుంది. కార్తితో `ఖాకీ, `ఖైదీ` వంటి విభిన్న‌మైన చిత్రాల్ని అందించిన మేక‌ర్స్ నిర్మిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు నెల‌కొన్నాయి.

సోమ‌వారం ఈ చిత్ర టీజ‌ర్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది.  `మ‌హా భార‌తం చ‌దివావా… భార‌తంలో కృష్ణుడు వంద అవ‌కాశాలిచ్చినా కౌర‌వులు మార‌లేదు. నువ్వు ఇవ్వ‌మంటుంది ఒక్క అవ‌కాశ‌మే క‌దా ఇస్తా..` అంటూ `మెర్స్‌ల్‌`లో వ‌న్ ఆఫ్ ది విల‌న్‌గా న‌టించిన హ‌రీష్ పెరాది వాయిస్‌తో టీజ‌ర్ మొద‌లైంది. ఇంత‌లో కార్ డోర్ ఓపెన్ కావ‌డం.. అందులోంచి కార్తి బ‌య‌టికి రాండం.. మాస్ జ‌నం `జై సుల్తాన్‌.. అంటూ కేక‌లు పెట్ట‌డం.. క‌న్న‌డ క‌స్టూరి ర‌ష్మిక మంద‌న్న లంగా ఓణీలో నీళ్ల‌ల్లో గెంతుతూ క‌నిపించ‌డం..విజువ‌ల్ ట్రీట్‌గా వుంది.

ఆ త‌రువాత `మ‌హాభార‌తంలో కృష్ణుడు పాండ‌వుల వైపు నించున్నాడు.. అదే కృష్ణుడు కౌర‌వుల వైపు వుంటే.. అదే మ‌హాభార‌తాన్ని ఒక‌సారి యుద్ధం లేకుండా ఊహించుకోండి….` అంటూ కార్తీ చెబుతున్న డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. శివ కార్తికేయ‌న్‌తో `రెమో` చిత్రాన్ని తెర‌కెక్కించిన భాగ్య‌రాజ క‌న్న‌న్ ఈ చిత్రాన్ని యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్గా తెర‌కెక్కించారు. ఫుల్ మాసీవ్ అంశాల‌తో నెపోలియ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.