షాహీద్ క‌పూర్ కాదు కార్తీక్ ఆర్య‌న్‌!

షాహీద్ క‌పూర్  కాదు కార్తీక్ ఆర్య‌న్‌!
షాహీద్ క‌పూర్ కాదు కార్తీక్ ఆర్య‌న్‌!

బాలీవుడ్ హీరో తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ `అర్జున్‌రెడ్డి` ఆధారంగా రీమేక్ అయిన `క‌బీర్‌సింగ్‌` చిత్రంతో మ‌ళ్లీ స‌క్సెస్‌బాట పట్టాడు. ఈ సినిమా అత‌నికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించ‌డ‌మే కాకుండా హీరోగా అత‌ని స్థాయిని, మార్కెట్‌ని పెంచింది. దీంతో తెలుగు రీమేక్‌ల‌పై క‌న్నేశాడు.  ఈ సినిమా ఇచ్చిన ఊపులో వున్న షాహీద్‌క‌పూర్ తాజాగా మ‌రో తెలుగు హిట్ ఆధారంగా రూపొందుతున్న రీమేక్‌లో న‌టిస్తున్నాడు.

తెలుగులో గత ఏడాది నేచుర‌ల్  స్టార్ నాని హీరోగా న‌టించిన చిత్రం `జెర్సీ`. తెలుగులో మంచి విజ‌యాన్ని సాధించిన ఈ చిత్రాన్ని ప్ర‌స్తుతం షాహీద్ క‌పూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. అల్లు అర‌వింద్‌, దిల్ రాజు అమ‌న్ గిల్, భౌమిక్ గోండాలియా నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌రువాత షాహీత్ మ‌రో తెలుగు చిత్ర రీమేక్‌లో న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేద‌ని తెలిసింది.

అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుద‌లై ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాల‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందులో షాహీద్ క‌పూర్ న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఇందులో కార్తిక్ ఆర్య‌న్ న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది.