గుణ 369 దర్శకుడితో మళ్ళీ కార్తికేయ

గుణ 369 దర్శకుడితో మళ్ళీ కార్తికేయ
గుణ 369 దర్శకుడితో మళ్ళీ కార్తికేయ

నిన్న విడుదలైన గుణ 369 చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది . కార్తికేయ హీరోగా నటించగా అనఘ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించాడు . బోయపాటి శ్రీను శిష్యుడైన అర్జున్ జంధ్యాల గుణ 369 చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే . బర్నింగ్ ఇష్యు తో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన గుణ369 చిత్రానికి హిట్ టాక్ రావడంతో దర్శకుడు అర్జున్ జంధ్యాల తో మళ్ళీ ఓ సినిమా ప్రకటించాడు హీరో కార్తికేయ .

మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉన్న గుణ 369 తో మంచి జోష్ మీదున్నాడు హీరో కార్తికేయ . ఈ చిత్రానికి బిసి కేంద్రాల్లో మంచి స్పందన వస్తోంది . దాంతో తనకు మంచి హిట్ ఇచ్చిన అర్జున్ తో మరో సినిమా చేయాలనీ ఉత్సాహపడుతున్నాడు కార్తికేయ . అయితే ప్రకటించారు కానీ సెట్స్ మీదకు వెళ్ళడానికి మాత్రం కాస్త సమయం పట్టేలా ఉంది ఆ ప్రాజెక్ట్ .