కరుణానిధి అంత్యక్రియలు పూర్తి


karunanidhi last rites completeతమిళుల ఆరాధ్యదైవం కలైంగర్ కరుణానిధి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం చెన్నై మేరీనా బీచ్ లో పూర్తయ్యాయి. తమ అభిమాన నాయకుడిని చివరి చూపు చూసుకోవాలని లక్షలాదిగా తరలివచ్చారు అభిమానులు. సాయంత్రం నాలుగు గంటలకు కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కాగా లక్షలాది జనాలు వెంట రాగా రెండు గంటలకు పైగా సమయం పట్టింది చెన్నై మేరీనా బీచ్ కు చేరుకోవడానికి. అక్కడికి చేరుకున్నాక కరుణానిధి పార్దీవ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు , అలాగే కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు పూర్తయ్యాయి .

ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , నాయకులు కూడా పాల్గొన్నారు. అయిదు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి గా13 సార్లు ఎం ఎల్ ఏ గా ఎన్నికై రికార్డు సృష్టించాడు కరుణానిధి. దాదాపు అరవై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఘన విజయాలు , అలాగే ఎన్నో పరాభవాలు ఎదుర్కొన్న కరుణానిధి మూలాలు తెలుగు జాతి కావడం విశేషం. కరుణానిధి పూర్వీకులు మన తెలుగు వాళ్ళే అయితే తమిళనాడు కి వలస వెళ్లడంతో క్రమేణా తమిళుడు అయిపోయాడు.

English Title: karunanidhi last rites complete