తెలంగాణ‌పై కస్తూరి సంచ‌ల‌న ట్వీట్!

తెలంగాణ‌పై కస్తూరి సంచ‌ల‌న ట్వీట్!
తెలంగాణ‌పై కస్తూరి సంచ‌ల‌న ట్వీట్!

త‌మిళ హీరో కార్తిపై అవాక్కులు చ‌వాక్కులు పేలి న‌వ్వుల పాలైన త‌మిళ న‌టి క‌స్తూరి తెలంగాణ‌పై చేసిన ట్వీట్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. చైనాలో చిక్కుకున్న బాదితుల త‌ర‌హాలో తాను క‌రోనా వ్యాపిస్తున్న తెలంగాణ‌లో వున్నాన‌ని, తాను హైద‌రాబాద్‌లో చిక్కుకు పోయాన‌ని పెట్టిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

త‌మిళ న‌టి కస్తూరి గ‌త కొన్ని రోజుల క్రితం ఓ ప‌నిమీద హైద‌రాబాద్ వ‌చ్చార‌ట‌. ఇక్క‌డ త‌న పూర్తి కావ‌డంతో చెన్నై తిరిగి వెళ్లిపోవాల‌నుకుంద‌ట‌. అయితే హైద‌రాబాద్‌లో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌టం, గాంధీలో ఇప్ప‌టికే కొంత మంది చేర‌డంతో బెంబేతెత్తిపోయిన క‌స్తూరి శంషాబాద్ ఏయిర్‌సోర్ట్‌కి వెళ్ల‌డానికి భ‌య‌ప‌డుతోంద‌ట‌.

ఈ క్ర‌మంలోనే ఆమె చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ పేషెంట్ వున్నారా?.. ఇక నేను హైద‌రాబాద్‌లో చిక్కుకు పోవాల్సిందేనా? ఎందుకంటే నాకు ఎయిర్ పోర్ట్‌కి వెళ్లాలంటే భ‌యంగా వుంది` అని క‌స్తూరి చేసిన ట్వీట్‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.