కత్తి కాంతారావు బయోపిక్ కూడా తీస్తారట


kathi kantarao biopic on cards

తెలుగునాట బయోపిక్ ల హవా మొదలయ్యింది , ఇటీవలే వచ్చిన మహానటి విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల రివార్డులను సైతం అందుకుంటోంది దానికి తోడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా అట్టహాసంగా ప్రారంభం కావడం తెలిసిందే . తాజాగా కత్తి కాంతారావు బయోపిక్ కూడా రూపొందించాలనే ప్రయత్నం జరుగుతోంది . ఎన్టీఆర్ , ఏ ఎన్నార్ లతో సమానంగా కత్తి కాంతారావు కు క్రేజ్ ఉండేది అంతేకాదు అప్పట్లో స్టార్ హీరో అంటే కత్తి కాంతారావు మాత్రమే !

1950 నుండి 1970 వరకు కత్తి కాంతారావు స్వర్ణ యుగాన్ని అనుభవించాడు . జానపద కథానాయకుడిగా అజరామమైన విజయాలను అందుకున్నాడు అయితే 1970 తర్వాత కత్తి కాంతారావు తన ప్రభావాన్ని కోల్పోయాడు . మెల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యాడు కానీ ఆర్ధికంగా చితికిపోవడంతో ఆయన్ని పెద్దగా చిత్ర పరిశ్రమ కూడా పట్టించుకోలేదు . 2009 లో ఈ లోకాన్ని వదిలి పెట్టారు కాంతారావు . మహానటి లాగే కాంతారావు ది కూడా విషాద గాథే ! దాంతో ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు ఉంటాయి కాబట్టి కాంతారావు బయోపిక్ చేయాలనీ పిసి ఆదిత్య అనే దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు .