కత్తి మహేష్ పై ఎన్ని కేసులు పెట్టారో తెలుసా


kathi mahesh again post on lord rama

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ పై ఎన్ని కేసులు నమోదు అయ్యాయో తెలుసా …… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కేసులకు పైగా నమోదు అయ్యాయి . హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి పై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నిన్న రాత్రి అతడ్ని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే . పోలీస్ స్టేషన్ లో కత్తి మహేష్ ని ఆ కేసు విషయం పై పలు ప్రశ్నలు వేసిన అనంతరం మళ్ళీ పిలిచినప్పుడు స్టేషన్ కు రావాలని నోటీసులు అందించడం జరిగింది . అయితే ఈరోజు కత్తి మహేష్ స్టేషన్ నుండి బయటకు వచ్చాక మళ్ళీ రామాయణం గురించి వివాదాస్పద అంశాలను లేవనెత్తడం చర్చనీయాంశం అవుతోంది . అయితే నేను కొత్తగా ఏమి చెప్పడం లేదని శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి తెలుగులోకి అనువాదం చేసిన రామాయణం లోని యుద్ధకాండ లోని కొంత భాగం మీ కోసం అంటూ పోస్ట్ పెట్టాడు .

హిందువులకు శ్రీరాముడు అంటే ఎనలేని అభిమానం అయితే కత్తి మహేష్ శ్రీరాముడి పై సీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహించిన బ్రాహ్మణ సంఘాలు , హిందూ సంఘాలు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కేసులను పెట్టారు . పెద్ద ఎత్తున ఫిర్యాదు లు రావడంతో పోలీసులు కత్తి మహేష్ పై కేసు లు నమోదు చేసారు . 15 కి పైగా కేసులు నమోదు కావడం కత్తి మహేష్ కు ఇబ్బందే మరి .

English Title: kathi mahesh again post on lord rama