కత్తి మహేష్ పై నగర బహిష్కరణ


Kathi Mahesh Expelled from Hyderabad

హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు పడింది. దాంతో ఇకపై పోలీసులు అనుమతి ఇచ్చేవరకు మళ్లీ హైదరాబాద్ లో కత్తి మహేష్ అడుగుపెట్టడానికి వీలు లేకుండా పోయింది. సంచలనం సృష్టిస్తున్న ఈ సంఘటన ధార్మిక విజయంగా భావిస్తున్నారు. గతకొంత కాలంగా కత్తి మహేష్ అదేపనిగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాడు ప్రతీ ఒక్కరి మీద . ఇక పవన్ కళ్యాణ్ తో పాటు మెగా కుటుంబం ని అయితే ఒక ఆట ఆడుకున్నాడు కత్తి మహేష్ . పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసాకే ఇతగాడు వెలుగులోకి వచ్చాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొన్నాడు కట్ చేస్తే రాజకీయ రంగప్రవేశం చేద్దామని జగన్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు కానీ ఈలోపు శ్రీరాముడు పై రామాయణం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు కించపరిచాడు. మహేష్ కత్తి వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అయిన నేపథ్యంలో నగర పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కత్తి మహేష్ ని హైదరాబాద్ నగరంలో నివసించడానికి అనర్హుడు అంటూ ఏకంగా నగర బహిష్కరణ విధించారు. మళ్లీ కత్తి మహేష్ హైదరాబాద్ నగరంలో అడుగు పెట్టాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. సాధారణంగా నగర బహిష్కరన నేరస్తులకు విధిస్తారు కానీ సమాజం పై విషం కక్కుతున్న కత్తి మహేష్ పై నగర బహిష్కరణ విధించారు. దాంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు ప్రముఖులు.

English Title: Kathi Mahesh Expelled from Hyderabad