కత్తి మహేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు


kathi mahesh in police custodyసినీ విమర్శకుడు కత్తి మహేష్ ని అరెస్ట్ చేసారు బంజారాహిల్స్ పోలీసులు . ఇటీవల ఓ ఛానల్ లో చర్చ సందర్బంగా శ్రీరాముడి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు కత్తి మహేష్ దాంతో అతడిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి , అంతేకాదు అతడిపై కేసు పెట్టడంతో బ్రాహ్మణ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు కత్తి మహేష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు . ప్రస్తుతం కత్తి మహేష్ బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు .

బిగ్ బాస్ వన్ సీజన్ లో పాల్గొన్న కత్తి మహేష్ పై మొదటి నుండి పలు వివాదాలు ఉన్నాయి . వివాదాలతోనే యితడు సెలబ్రిటీ అయ్యాడు . పలు వివాదాలతో ఇమేజ్ వస్తుండటమే కాకుండా మీడియాలో కూడా హైప్ వస్తోంది కాబట్టి ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు . తాజాగా శ్రీరాముడు పై వ్యాఖ్యలు చేయగా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడేవాడు . దాంతో మెగా ఫ్యాన్స్ కు కత్తి మహేష్ అంటే విపరీతమైన కోపం . హిందువులకు ఆరాధ్య దైవం శ్రీరాముడు కాగా రాముడు – సీత ల పై రాయకూడని విధంగా వ్యాఖ్యలు చేసి పెద్ద వివాదాన్ని సృష్టించాడు .

కత్తి మహేష్ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నాడు కొంతకాలంగా , వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఇలా కేసులో ఇరుక్కోవడం అతడికి పెద్ద మైనస్ అనే చెప్పాలి .