నాగబాబు కి వార్నింగ్ ఇచ్చిన కత్తి మహేష్


kathi mahesh strong warning to nagababu మెగా బ్రదర్ నాగబాబు కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు సినీ విమర్శకుడు కత్తి మహేష్ . ఇటీవల హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పై అలాగే సీతమ్మ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు కత్తి మహేష్ , దాంతో పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు వచ్చాయి అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించాడు కత్తి మహేష్ పై విమర్శలు చేయడమే కాకుండా వార్నింగ్ ఇచ్చాడు ఇంకేముంది కత్తి మహేష్ కు మళ్ళీ మెగా కుటుంబం పై విమర్శలు చేసే పని ఇచ్చి నట్లైంది దాంతో తాజాగా ఓ వీడియో ని పోస్ట్ చేసాడు నాగబాబు కుగట్టిగా వార్నింగ్ ఇస్తూ .

మీ సినిమా జీవితం , రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే చాలా ఉంది , ఎవరికీ తెలియదని అనుకుంటున్నారా ? మీ హద్దుల్లో మీరు ఉంటే మంచిది అంతేకాని అదుపు తప్పి విమర్శిస్తే సహించేది లేదు అంటూ నాగబాబు పై విమర్శలు ఎక్కుపెట్టాడు . నేను రాముడి పై చేసిన వ్యాఖ్యలను అర్ధం చేసుకోండి అంతేకాని నన్ను టార్గెట్ చేస్తే సహించేది లేదని అంటున్నాడు కత్తి మహేష్ .

ఇంతకుముందు కూడా మెగా కుటుంబం పై పలుమార్లు విరుచుకు పడ్డాడు కత్తి మహేష్ , ఇక పవన్ కళ్యాణ్ పై అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎంతగా రెచ్చిపోయాడో అంతేలేదు . ప్రజారాజ్యం పార్టీ పెట్టి పలు విమర్శల పాలయ్యింది మెగా కుటుంబం దాంతో అప్పటి ఎపిసోడ్ ని మళ్ళీ గుర్తుకు తెస్తున్నాడు కత్తి మహేష్ .

English Title: kathi mahesh strong warning to nagababu